న్యాయసేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం

0
0


న్యాయసేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం

మాట్లాడుతున్న కార్యదర్శి కిరణ్మయి

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: న్యాయసేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యదర్శి కిరణ్మయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా న్యాయసేవా సంస్థ భవన్‌ నుంచి విద్యార్థులతో ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం హరిచరణ్‌ మార్వాడీ హిందీ విద్యాలయ్‌లో న్యాయవిజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో కార్యదర్శి కిరణ్మయి మాట్లాడుతూ.. సత్వర న్యాయానికి రాజీమార్గమే మంచిదన్నారు. పేదలకు ఉచిత న్యాయం అందించడానికే ఈ న్యాయసేవా సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, అంకిత, రమాదేవి, సీతారాం పాండే, ఓం నారాయణ అట్టల్‌, పారాలీగల్‌ వాలంటరీలు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here