పంచాయతీలో ఎంపీటీసీ కుర్చీ కోసం లొల్లి

0
4


పంచాయతీలో ఎంపీటీసీ కుర్చీ కోసం లొల్లి

సర్పంచి, ఎంపీటీసీల వాగ్వాదం…


గొడవ పడుతున్న సర్పంచి సలీం, ఎంపీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండ మండలం అంబారిపేటలోని గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ సభ్యుడు సొంత కుర్చీ వేసుకోవడంపై సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడికి ఆదివారం గొడవ జరిగింది. 20 రోజుల కిందట ఎంపీటీసీ సభ్యుడు ఫిరంగి రాజేశ్వర్‌ కుర్చీని కొనుగోలు చేసి, పంచాయతీ పాలకవర్గపు ఛాంబర్‌లో సర్పంచి పక్కన (కుర్చీ, బల్లను) పెట్టుకున్నారు. అదే సీటులో కూర్చొని వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఎంపీటీసీ వేసుకున్న బల్లను తొలగించారు. మద్యపాన నిషేధ విషయమై ఆదివారం పంచాయతీలో సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తరువాత తన కుర్చీని పక్కకు తీయవద్దని ఎంపీటీసీ సభ్యుడు సిబ్బందికి తెలిపారు. స్పందించిన సర్పంచి సలీం.. ఏమైందంటూ ఎంపీటీసీ సభ్యుడి మాటకు ఎదురు తిరిగారు. ఏ పంచాయతీలో ఎంపీటీసీకి కుర్చీ లేదు.. ఇక్కడెందుకు ఉంచుతాం.. తీసేస్తామంటూ సర్పంచి సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి వాగ్వాదం ముదిరింది. చివరకు స్థానికులు జోక్యం చేసుకొని వారిని సుముదాయించారు. గ్రామస్థుల కోరిక మేరకు సర్పంచి వెళ్లిపోగా, అదే కుర్చీలో ఎంపీటీసీ కూర్చొని పంచాయతీ సిబ్బందితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ భయం ఉందని సర్పంచి సలీం దోమకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఫిర్యాదు ఇచ్చింది వాస్తవమేనని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here