పంటల సాగుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు సాగుచేస్తుండడంతో వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మత్స్యశాఖలతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ 2019లో సంవత్సరానికిగాను లక్ష 20 వేల 895 హెక్టార్లలో రైతులు ఆయా పంటలు సాగుచేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here