పండగకు జీతాలిస్తరా..?

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ (ఏఐటియుసి) అను బంధ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారి డిఎంఅండ్‌హెచ్‌వో స్పందన, జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించక పోవడం బాధాకరమన్నారు. కార్మికులకు జీతాలు లేక అద్దెలు, పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు తెచ్చుకొని నానా ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే కార్మికుల జీతాలు అడిగితే కాంట్రాక్టర్‌, ప్రభుత్వం బడ్జెట్‌ లేదని చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వెంటనే జిల్లా అధికారులు కలెక్టర్‌ ప్రభుత్వానికి తెలియచేసి కార్మికులకు జీతాలు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి పి.బాలరాజు, కార్మికులు ఫాజియా, సునీత, రాజయ్య, శ్రీనివాస్‌, దేవేందర్‌, గణేష్‌, రాజేశ్వర్‌, నవీన్‌, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here