పండగ పూట పర్సనల్ లోన్ : ఈ విషయాలు మరచిపోకండి..

0
3


పండగ పూట పర్సనల్ లోన్ : ఈ విషయాలు మరచిపోకండి..

పండగల సీజన్ మొదలవుతోంది. దసరా, దీపావళి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అందరు. కొత్త బట్టలతో పాటు అనేక కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కొత్త మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తుంటారు ఎక్కువ మంది. అయితే వీటికి చాలా ఎక్కువ మొత్తమే అవసరం ఉంటుంది. కొంత మంది తాము పొదుపు చేసిన మొత్తంతో వీటిని కొనుగోలు చేస్తే.. మరికొంత మంది అప్పుచేసి కొనుగోలు చేస్తుంటారు. అందులోను కొందరు వ్యక్తి గత రుణం తీసుకుని కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇలా వ్యక్తిగత రుణంతో పండగల సందర్భంగా కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేమిటంటే..

ఎంత భారమో చూసుకోండి..

* అప్పు తీసుకునేటప్పుడు ఆనందం ఎంత ఉంటుందో తిరిగి చెల్లించేటప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుంది.

* కొత్త వస్తువులను కొనుగోలు చేసే జోష్ లో రుణంపై ఎంత వడ్డీ ఉంటుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కొనడం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత లెక్కలు వేసుకుంటారు.

* వ్యక్తిగత రుణం కోసం బ్యాంకులకే వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా ఫిన్ టెక్ కంపెనీలు వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే వీటి నుంచి రుణం పొందవచ్చు. అయితే ఈ రుణాలపై వడ్డీ రేటు ఎంత ఉంటుందన్న దాని గురించి మాత్రం మరచిపోవద్దు.

అధిక వడ్డీ రేట్లు

అధిక వడ్డీ రేట్లు

* పర్సనల్ లోన్స్ అంటేనే అన్ సెక్యూర్డ్ రుణం. ఈ రుణాలకు బ్యాంకులు గానీ ఫిన్ టెక్ కంపెనీలు గాని ఎలాంటి హామీని కోరవు. ఈ రుణాల విషయంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తారు.

* రుణం తీసుకునే వారి క్రెడిట్ చరిత్ర, రుణం ఇచ్చే ఆర్ధిక సంస్థను బట్టి పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు ఆధార పడి ఉంటుంది.

* సాధారణంగా వ్యక్తి గత రుణం పై వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది.

ఏం చేయాలంటే...

ఏం చేయాలంటే…

* వ్యక్తి గత రుణం అత్యవసరానికి మాత్రమే తీసుకోవడం మేలు.

* మీకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకుంటే.. కాస్త ముందునుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఈ మొత్తం కూడా మీరు కోరుకున్న దానికి సరిపోకపోతే అప్పుడు రుణం తీసుకునే విషయం గురించి ఆలోచించండి.

* వ్యక్తి గత రుణంపై వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పేమెంట్ చార్జీలు ఏ విధంగా ఉన్నాయో ముందుగానే తెలుసుకోవాలి.

* సాధారణంగా రుణం పై ప్రాసెసింగ్ చార్జీలు1 శాతం నుంచి 3 శాతం వరకు, ప్రీ పేమెంట్ చార్జీలు 2 శాతం నుంచి 5 శాతం వరకు ఉండవచ్చు.

* తక్కువ కాలపరిమితికి తీసుకునే రుణంపై తక్కువ.. ఎక్కువ కాలపరిమితి రుణానికి ఎక్కువ వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. కాబట్టి రెండేళ్ల కన్నా తక్కువ కాలపరిమితి రుణాలను ఎంచుకోవడం మంచిది.

* తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే ఎక్కువ నెలవారి వాయిదా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here