పంత్ మెడపై కత్తి.. రెండో టీ20 రాణిస్తే సరి లేదంటే అంతే: కోహ్లీ

0
2


హైదరాబాద్: మొహాలీ వేదికగా బుధవారం జరగనున్న రెండో టీ20 కోసం జట్టులోని యువ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది.

ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 మొహాలీ వేదికగా బుధవారం జరగనుంది. రెండో టీ20కి ముందు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఇక, నాలుగో స్థానంలో అయ్యర్ లేదా పాండేలలో ఎవరో ఒకరు ఆడనున్నట్లు తెలిపాడు. టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ పంత్ తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే రెండో టీ20లో రాణించాల్సిన అవసరం ఉందని కోహ్లీ అన్నాడు. పంత్ ఒకే షాట్‌కు ప్రతి సారీ ఔటవడం ఆందోళనకు కలిగిస్తోందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఈ సిరిస్‌లో అతడు తన బలహీనతను అధిగమిస్తాడని కోహ్లీ అశాభావం వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న చాహర్, సుందర్‌లు రాణిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు. పేసర్లు నవదీప్ షైనీ, దీపక్ చాహర్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నామని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు.

ఇదిలా ఉంటే, భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 13 టీ20లు ఆడాయి. ఇందులో టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా… 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా చేతిలో అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్టుగా ఆస్ట్రేలియా(11) అగ్రస్థానంలో ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here