పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిజాంపేట్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. శాసన సభ్యులు యం.భూపాల్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోగల కందకాలలో నీరు నిలువ ఉండడంతో సర్పంచ్‌ జగదీశ్వర్‌ చారి తయారు చేయించిన బాబుల్స్‌ నీటి గుంతలలో దోమల లార్వా చనిపోవడానికి వేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి, రోగుల ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో హనుమాన్‌ గణేష్‌ మండలి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పదార్థాలు వడ్డన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎమ్మెల్యేకు గులాబీ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేశ్‌, సురేందర్‌ డిఎల్‌పివో గారు ఎంపీడీఓ వీరబ్రహ్మ చారి, ఎంపివో లక్ష్మరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజా బాయి రాంచందర్‌, ఎంపీటీసీలు సాయిరెడ్డి, సబితా లింగారెడ్డి, వార్డ్‌ సభ్యులు రాజాక్‌, నీలే రావు, యాదగిరి, నర్సింలు, సాయిలు, నర్సయ్య, సెక్రెటరీ యాదయ్య, సత్యనారాయణ, అంజయ్య, కిష్టయ్య, లింగ గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నరేందర్‌, గ్రామస్తులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here