పట్టణంలో ఓటేద్దాం

0
1


పట్టణంలో ఓటేద్దాం

పుర సమరానికి యంత్రాంగం ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు ఆశావహులు ఓటరు నమోదుపై దృష్టి సారించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే వరకు నమోదు చేసుకొన్న వారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో పట్టణాలకు వలసొచ్చిన పల్లెవాసులపై దృష్టి కేంద్రీకరించారు. వార్డులు, డివిజన్ల విభజన పూర్తయిన క్రమంలో తమకు కావల్సిన వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఉభయ జిల్లాల్లో నిజామాబాద్‌ నగరంతో పాటు ఆర్మూర్‌, కామారెడ్డి, బోధన్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి భీమ్‌గల్‌ పురపాలికలు ఉన్నాయి. ఈ నెల చివరికల్లా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్న తరుణంలో దానికి అనుగుణంగానే అధికారులు సిద్ధం అవుతున్నారు. వార్డులు, డివిజన్ల పునర్విభజన పూర్తయింది. దీనికి సంబంధించి అనుసంధానంలో పేర్లు వస్తాయి
ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుర ఎన్నికలకు సంబంధించి మాత్రం నోటిఫికేషన్‌ వచ్చేంత వరకు పేరు నమోదు చేసుకుంటే.. ఏ డివిజన్‌కు చెందిన వారిని అక్కడి ఓటరు జాబితాకు అదనంగా అనుసంధాన జాబితాలో చేరుస్తారు.  గెజిట్‌ రావాల్సి ఉంది.  మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన ఇప్పటికే  పూర్తిచేశారు. వివరాలు వెలువడగానే స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
కావల్సిన వారి పేర్లు నమోదు
పురపాలిక, నగర పాలక సంస్థలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా పోటీ చేసే ఆశావహులు వారికి అనుకూలమైన వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేసే పనిలో ఉన్నారు. పిల్లల విద్యాభాస్యం, ఇతర పనుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరం, పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారిపై దృష్టి సారించారు. ఇలాంటివారు తమ పరిధిలో ఎంత మంది ఉన్నారోనని గుర్తిస్తున్నారు. కాలనీలో 18 ఏళ్లు నిండి ఇంకా ఓటరుగా నమోదు కాని వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారితో పేర్లు నమోదు చేయిస్తున్నారు. నగరంలో ఓ నేత మహారాష్ట్రకు చెందిన వారి పేర్లను చేర్చే పనిలో ఉన్నట్లు సమాచారం. మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉండే వారి బంధువులను ఇక్కడ ఓటరుగా నమోదు చేయించాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్‌లో..
అర్హులైన వారు ఎవరైనా ఇంకా ఓటరుగా నమోదు కాకపోతే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
www.ceo.com అనే వెబ్‌సైట్‌లో ఫారం-6, ఎన్నారైలు ఫారం-6ఏలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ఫారం-7, తప్పులు సరి చేసుకునేందుకు ఫారం-8, ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరొక కేంద్రానికి పేర్లు మార్చుకునేందుకు ఫారం-8ఏ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కాకుంటే స్థానికంగా ఉండే తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here