పట్టించుకోకపోతే చర్యలు తీసుకుంటాం

0
2


పట్టించుకోకపోతే చర్యలు తీసుకుంటాం

జడ్పీ సీఈవో గోవింద్‌

ఎమ్మెస్సీఫారం(ఎడపల్లి), న్యూస్‌టుడే: పనుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తామని జడ్పీ సీఈవో గోవింద్‌ స్పష్టం చేశారు. జానకంపేట, బాపునగర్‌, ఎమ్మెస్సీ ఫారం, ఎడపల్లిలో కొనసాగుతున్న పనులను సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ఎడపల్లిలో కొనసాగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరోసారి పర్యవేక్షించారు. ఎడపల్లిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటకపోవడంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్‌, ఉపాధి హామీ క్షేత్ర సహాయకురాలు సుచరితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటిన ప్రతి మొక్కకు కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికను అందించాలని ఎంపీడీవో శంకర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, సర్పంచి మాధవి తదితరులున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here