పడక గదిలో రహస్య కెమేరాతో భర్తపై నిఘా, భార్య అరెస్ట్.. ట్విస్ట్ అదిరింది!

0
1


‘పెళ్లం ఊరెళితే’ సినిమా చూసినవాళ్ళకు.. భర్తలు చేసే చిలిపి చేష్టలు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. కొంతమంది భర్తలు.. భార్య ఇంట్లో లేకపోతే చాలు, ఇంటికి అమ్మాయిలను తెచ్చుకుని పండగ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్తపై నిఘా పెట్టేందుకు తమ పడక గదిలో రహస్య కెమేరా పెట్టింది. కానీ, అదే ఆమెను సమస్యల్లోకి నెట్టింది.

ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు మన ఇండియాలోనే. పుణేకు చెందిన ఓ జంట 2016 నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, కోర్టు తగిన ఆధారాలను సమర్పిస్తే తప్పకుండా విడాకులు మంజూరు చేస్తామని చెప్పింది. భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆమె తమ పడక గదిలో రహస్య కెమేరాను ఏర్పాటు చేసింది.

Read also: అది కోసి కుక్కలకు వేసింది.. భర్తను దారుణంగా చంపిన భార్య

ప్రియురాలితో భర్త రాసలీలలను రికార్డు చేసి, ఆ వీడియోలను కోర్టుకు అప్పగించింది. అయితే, ఇక్కడే ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ వీడియోలో ఉన్న భర్త ప్రియురాలు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన ప్రైవసీకి భంగం కలిగించారంటూ భార్య, ఆమె తరఫు న్యాయవాది అభిజిత్ సర్వతేపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భార్యను అరెస్టు చేశారు.

ఈ ఘటనపై సంగ్వీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ (క్రైమ్) అజయ్ భోస్లే మాట్లాడుతూ.. ‘‘అభిజిత్ సర్వతే ఆ వీడియోను తన క్లయింట్భర్త ప్రియురాలికి చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు భారీ మొత్తాన్ని చెల్లించకపోతే ఆ వీడియోను సోషల్ మీడియలో పెడతానని బెదిరించాడు. నిందితురాలు కూడా భారీ మొత్తాన్ని ముట్టజెప్పి విడాకులు ఇవ్వకపోతే వీడియోను బయటపెడతామని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు’’ అని తెలిపారు.

Read also: సెక్స్‌గేమ్ హర్రర్.. అంగాన్ని కోసేసిన ప్రియురాలు, చివర్లో ఊహించని ట్విస్ట్!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 354 (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు చూసి ఆనందం పొందడం), 507 (రహస్య వ్యవస్థతో బెదిరింపులకు పాల్పడటం), 120 (నేరం చేయడానికి రహస్య పన్నాగం) కింద ఆమెపై కేసులు నమోదు చేశామని అజయ్ భోస్లే తెలిపారు.

ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన ఇంట్లో రహస్య కెమేరాను పెట్టాడు. ఓ రోజు ఆ కెమేరా ఆమె కంటపడింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టినందుకు కేసు నమోదు చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here