పడక గదుల్లోనే తరగతులు

0
2


పడక గదుల్లోనే తరగతులు

మంజూరు కాని పాఠశాల భవనం

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఉప్పల్‌వాయి(రామారెడ్డి), న్యూస్‌టుడే

ఉప్పల్‌వాయి గురుకుల పాఠశాల వసతి గృహంలో కొనసాగుతున్న తరగతులు

ప్పల్‌వాయి గురుకుల పాఠశాలలో వసతి గృహం పడక గదుల్లో తరగతి గదులు కొనసాగుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 560 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గతంలో మరమ్మతులు నిమిత్తం రూ.36 లక్షలు విడుదల చేశారు. మరమ్మతులు చేసిన ఫలితం లేదని పనులు అర్ధంతరంగా ఆపేశారు. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. విద్యార్థులు అనారోగ్యం పాలైనా తరగతి గదుల్లో పడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సాఫీగా విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది.

నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి

తాడ్వాయి మండలంలోని గురుకుల పాఠశాలలో ఒకే ప్రాంగణంలో రెండు గురుకులాలు కొనసాగుతున్నాయి. లింగంపేట గురుకులానికి నాలుగు గదులు కేటాయించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీరి సంఖ్యకు సరిపడా గదులు లేవు. నాగిరెడ్డిపేట మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను స్థలం లేకపోవడంతో కామారెడ్డికి తరలించారు. గురుకులాల్లో సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

శిథిలావస్థలో పాఠశాల భవనం

అధికారులు మా గోడు పట్టించుకోవాలి

పాఠశాలకు భవనం లేకపోవడంతో వసతి గృహంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యం బాగాలేనప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు సరైన స్థలం లేదు. అధికారులు స్పందించి భవన సముదాయం నిర్మించాలి. – సంపత్‌, ఇంటర్‌ విద్యార్థి

ప్రతిపాదనలు పంపాం

– పూర్ణచందర్‌రావు, ప్రిన్సిపల్‌

గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ 7.70 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆరు అదనపు తరగతి గదులు, అదనపు మరుగుదొడ్ల బ్లాక్‌ నిర్మాణానికి కేవలం రూ.50 లక్షలు మంజూరయ్యాయి. పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here