పడగ విప్పి, బుసలు కొడుతున్న పామును పళ్లెంలో పెట్టి పూజలు.. వీడియో వైరల్

0
2


నాగదోషం ఉంటే శాంతి పూజలు చేయడం సాధారణమే. కానీ, ఆ కుటుంబం ఏకంగా విష సర్పాన్ని ముందు పెట్టుకుని పూజలు చేశారు. శివరాత్రి రోజు పూజారి మంత్రాలు చదువుతుంటే.. పళ్లెంలో పడగవిప్పిన నాగపాముకు ఓ జంట పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఆ పాము బుసలు కొడుతూ కాటేయడానికి కూడా ప్రయత్నించింది. అయితే, పాములు పట్టుకునే వ్యక్తి అది ఏమీ చేయదని చెప్పడంతో భయంతోనే పూజను కొనసాగించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లు సమాచారం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here