పతకం ఖాయం చేశారు: థాయిలాండ్ ఓపెన్ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి

0
0


హైదరాబాద్: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగన పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో సాత్విక్‌ జోడీ 22-20, 22-24, 21-9 తేడాతో కొ సంగ్‌ హ్యూన్‌-షిన్‌ బేక్‌ చియోల్‌ (దక్షిణ కొరియా) జోడిపై విజయం సాధించింది.

ఫ్లోరిడాలో తొలి టీ20: భారత్ Vs విండిస్ మ్యాచ్‌కి పొంచి ఉన్న వర్షం ముప్పు!

తొలి గేమ్‌ను 22-20తో పోరాడి గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ల జోడి… రెండో గేమ్‌లో మాత్రం చతికిలపడింది. మరోవైపు రెండో గేమ్‌లో కొ సంగ్‌ హ్యూన్‌‌ల జోడి అనూహ్యంగా పుంజుకోవడంతో 24-22తో నెగ్గింది. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్‌-చిరాట్‌ల జోడి తమ అనుభవంతో మరింత దూకుడగా ఆడింది.

ముఖ్యంగా కో సంగ్‌ హ్యూన్‌ జోడీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-9తేడాతో గేమ్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ల జోడి లి జున్‌ హు- యు చెన్‌(చైనా)తో తలపడనుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ పోరాటం ముగిసింది.

తొలి టీ20: బాబర్ అజాం, కోహ్లీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టేనా?

క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 18-21, 12-21తో కెంటా సునెయామా (జపాన్‌) చేతిలో ఓడగా…. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌- అశ్విని పొన్నప్ప 13-21, 15-21తో వతనబె- ఎరీసా (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here