పది కాలాలు నిలిచిపోయేలా పనులు

0
4


పది కాలాలు నిలిచిపోయేలా పనులు

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మోతెలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

మోతె(వేల్పూర్‌), న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో పది కాలాల పాటు నిలిచే పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోతెలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘాన్ని డీసీసీబీ ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులను ఆదుకోడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో ఎస్సారెస్పీకి రివర్సు పంపింగ్‌ ద్వారా నీరు అందిస్తామన్నారు. నిధులు ఎక్కువ మొత్తంలో అటువైపు మళ్లించడంతో అన్నింటికీ కేటాయించడంలేదన్నారు. త్వరలోనే అన్ని ప్రగతి పనులకు భారీగా నిధులు వస్తాయని చెప్పారు. పెద్ద చెరువుకు నీరు అందించే మాటు కాలువ నిర్మాణంలో రైతులకు సకాలంలో చెక్కులు అందించకపోవడంతో భూమి సేకరించడం ఆలస్యమైంది. సెప్టెంబరులో నీటిని మోతె పెద్ద చెరువుకు అందించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లకు భూసమస్య ఉందని, త్వరలోనే పరిష్కరించి నిర్మాణాలు చేపడతామని చెప్పారు. సీఎం దత్తత గ్రామం మోతెను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ జమున, జడ్పీటీసీ సభ్యురాలు భారతి, సర్పంచులు రజిత, చిన్నవ్వ, ఎంపీటీసీ సభ్యురాలు సత్తెవ్వ, డీసీసీబీ డైరక్టర్‌ గంగారెడ్డి, డీసీవో సింహాచలం పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here