పదోన్నతుల పరిశీలన

0
2


పదోన్నతుల పరిశీలన

తెవివిలో ఆచార్యులు,సహ ఆచార్యుల సంబురం
మూడేళ్ల తర్వాత మోక్షం
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి)

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పదోన్నతుల (వేతనాలకు సంబంధించి) సందడి నెలకొంది. సహాయ, సహ ఆచార్యుల పదోన్నతుల పత్రాలు గురువారం పరిశీలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో వచ్చిన ఆరోపణల దృష్ట్యా ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల్సినవసరం ఉంది.

యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీం ద్వారా పదోన్నతులు(వేతనాల పెంపు) కల్పించాల్సి ఉంటుంది. తెవివిలో మూడేళ్లుగా నిలిచిపోయాయి. మాజీ ఉపకులపతి చేపడతారని అంతా భావించారు. ఆచార్యుల్లో కనీస ఏజీపీ రాకపోవడంతో ఆయన సాహసించలేదు. కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, అర్థశాస్త్రంతో పాటు పలు విభాగాల్లో పని చేస్తున్న సహాయ ఆచార్యుల పదోన్నతులకు అడ్డుపుల్ల పడినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి. 2007, 2008, 2009, 2014 సంవత్సరంలో నియమితులైన అధ్యాపకులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి వినతులకు స్పందించిన ఇన్‌ఛార్జి ఉపకులపతి  అనిల్‌కుమార్‌ ఆమోద ముద్ర వేశారు.

‘ఆమె’కు అప్పగించడంపై అనుమానాలు
కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీం పదోన్నతుల వ్యవహారాన్ని అంతర్గత నాణ్యత విభాగం(ఐక్యూఏసీ) డైరెక్టర్‌ అత్తర్‌ సుల్తానాకు అప్పగించినట్లు తెలిసింది. ఈమె కూడా పదోన్నతికి దరఖాస్తు చేసుకొన్నారు. ఒక అభ్యర్థిగా హాజరుకావల్సిన ఐక్యూఏసీ డైరెక్టర్‌ అత్తర్‌ సుల్తానాకు బాధ్యతలు అప్పగించడంపై ఇతర అధ్యాపకులు తప్పుబడుతున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here