పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు కృషి

0
1


పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు కృషి

మాట్లాడుతున్న జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి

బీర్కూర్‌, న్యూస్‌టుడే: వసతి గృహల్లో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి పేర్కొన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరు, నిత్యావసర సరకుల నిల్వల దస్త్రాలను పరిశీలించారు. విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చలికాలం దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ప్రీమెట్రిక్‌ వసతి గృహాల్లోని 1700 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. లేని విద్యార్థులకు మూడు రోజుల్లో సరఫరా చేస్తామన్నారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా విద్యార్థులకు భోజనం పెడుతున్నామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో వసతి గృహాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతి నెల సిలబస్‌ ప్రకారం చదువుకునేందుకు ‘పాఠశాల’ పేరుతో గైడ్స్‌ మాదిరిగా పుస్తకాలు, 5, 7 తరగతి విద్యార్థులకు ‘మాబడి’ పుస్తకాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె వెంట వార్డెన్‌ రాములు, సిబ్బంది సాయిలు, లక్ష్మణ్‌ ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here