పన్ను తాఖీదు

0
2


పన్ను తాఖీదు

ఎగవేతదారులపై నజర్‌

పలువురికి నోటీసులు

పన్ను తాఖీదు

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ : పన్ను చెల్లించని వారిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు తాఖీదులు అందుకొన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆదాయ పన్ను ఎగవేత దారులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీరి సంఖ్య 20 వేల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. రెండు జిల్లాల్లో కలిపి పన్ను చెల్లించే వారి సంఖ్య 40 వేల వరకు ఉంటోంది. గతేడాదితో పోలిస్తే రెండు వేలు మాత్రమే పెరిగింది. పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిందో అధికారులు ‘లెక్క’లు తీయడం ఆరంభించారు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పాన్‌కార్డు కలిగిన వారు సుమారు 4-5 లక్షల మంది ఉంటారు. వీరంతా పన్ను పరిధిలోనికి రారు. నిర్ణీత పరిధి దాటిన ఉద్యోగులు, వ్యాపారులు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 40వేల మంది మాత్రమే పన్ను చెల్లించారు.. చాలా మంది తప్పించుకొంటున్నారు. అలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగస్థులే ఎక్కువగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. పన్ను పరిధిలోకి రాకుండా వ్యాపారులు దొంగ లెక్కలు చూపిస్తున్నట్లు తేల్చారు. కొందరు బిల్లులు నకిలీవి సృష్టించి పన్ను నుంచి మినహాయింపు పొందుతున్నారు. మరికొందరు కొందరు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరపకుండా జాగ్రత్త పడుతున్నారు. డిజిటల్‌ లావాదేవీలను ఏ మాత్రం ప్రోత్సహించడం లేదు. ఫలితంగా ఎంత వ్యాపారం జరిగినా కొంతమొత్తంలో చూపెడుతున్నారు. ఇలాంటి వారిలో కొందరిని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here