‘పప్పు లాంటి అబ్బాయి’ పాటకు వాళ్లతో కలిసి ఆర్జీవీ స్టెప్పులు!!

0
2


‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ప్రమోషన్స్ చూసి ఓ వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంటే ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ‘పప్పు లాంటి అబ్బాయి’ పాటకు చంద్రబాబు, లోకేశ్ పాత్రధారులతో కలిసి వర్మ స్టెప్పులేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లోగా సాగే ఈ పాటకు వర్మ స్లో మోషన్‌లో స్టెప్పులేస్తుంటే ఒకటే అరుపులు కేకలు.

మరోవైపు ఈ పాట వస్తుంటే చంద్రబాబు పాత్రధారి.. లోకేశ్ పాత్రధారిని ఓదారుస్తున్నారు. వాళ్లిద్దరినీ వర్మ ఓదారుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టు ఉన్నా ఓ వర్గానికి ఈ వీడియో బాగా పనికొచ్చింది. ఆ వర్గమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, రామ్ గోపాల వర్మ తన స్వార్థం కోసం రెండు కులాలు, వ్యక్తులను వాడుకొని వారిపై బురదజల్లుతున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చూసుకున్నా కులాలు, మతాలు, వ్యక్తుల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సినిమాలు చేసినా అది నేరమేనని.. కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లను అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని వాదిస్తున్నారు. తన వ్యాపారం, సంపాదన కోసం ఇతరుల పరువు ప్రతిష్టలను వర్మ ఎలా వాడుకుంటాడని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘ఆకాశం నీ హద్దురా!’ అంటున్న సూర్య.. ఇదుగో ఫస్ట్‌లుక్

అయితే.. రామ్ గోపాల్ వర్మ, ఆయన వేషాలను పట్టించుకునేవారు కూడా బాగా తగ్గిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా టైంలో వర్మకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో వివాదాస్పద పాత్రలన్నింటినీ తీసుకున్నా ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఏదో ఒక వర్గానికి చెందిన కొంత మంది మాత్రమే వర్మను సపోర్ట్ చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here