పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

0
1


పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి


సీఎస్‌, డీవోల సమావేశంలో అధికారులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో జనార్దన్‌రావు అన్నారు. డీఈవో కార్యాలయంలో శనివారం పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించవద్దని సూచించారు. విద్యార్థులు సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. చరవాణి, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రానికి అనుమతించమని సూచించారు. ఇందులో ఏసీఈ విజయభాస్కర్‌, ఓపెన్‌ స్కూల్స్‌ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రవీందర్‌, సీఎస్‌, డీవోలు పాల్గొన్నారు.aSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here