పర్యాటక ప్రాంతాల అభివద్ధికి కషి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివద్ధి చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులను జిల్లాలోని పర్యాటక కేంద్రాలకు తీసుకువెళ్లే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక కేంద్రాల అభివద్ధి వల్ల ఉపాధితో పాటు ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివద్ధి చెందుతాయని తెలిపారు. పర్యాటక పర్యటన వల్ల పర్యాటకులకు ఆ ప్రాంతాలకు సంబంధించి చారిత్రక విషయాలు తెలుస్తాయని పర్యటన సమయంలో ఆహ్లాదంగా, సంతోషంగా గడుపుతారని, కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడడంతో పాటు కొత్త వ్యక్తుల పరిచయాలు, స్నేహం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. అంతేకాక ఆ ప్రాంతాలకు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని బిసి, ఎస్‌టి, ఎస్సి సంక్షేమ వసతి గహాలకు చెందిన 60 మంది విద్యార్థులను జిల్లాలోని పోచంపాడు, లింబాద్రి గుట్ట, సిద్దులగుట్ట, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సు ద్వారా తీసుకు వెళ్లి ఆ ప్రాంతాల విశిష్టతలను, చారిత్రక విషయాలను తెలియజేయడం జరుగుతుందని వివరించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here