పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

0
0


పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

చిన్నమల్లారెడ్డి(కామారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని చిన్నమల్లారెడ్డి ఉన్నత పాఠశాలలో ‘బాలల హరితహారం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ విద్యార్థులతో కలిసి సోమవారం మొక్కలు నాటారు. గ్రామంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలోని మొక్కలను దత్తత తీసుకుని సంరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, సర్పంచి రత్నాబాయి, ఎంపీటీసీ సభ్యులు నీలవ్వ, అనంతలక్ష్మి, ఉపసర్పంచి వనిత, ఎఈంవో ఎల్లయ్య, ఎంపీడీవో నాగేశ్వర్‌, సీఆర్పీ చిరంజీవి, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ జీవన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, చంద్రవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here