పలుగ్గుట్ట జాతరకు ఏర్పాట్లు పూర్తి

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ నిర్వాహకులు మంగిరాములు మహారాజ్‌ గత 36 దినాలుగా గర్భగుడిలో దీక్షలో ఉన్నారు. కాగా సోమవారం రాత్రి దీక్ష విరమింప చేయనున్నారు. ఈ సందర్భంగా జాతర, అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ సందేశం ఇవ్వడానికి వేదిక ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 40 నుండి 50 వేల మందికి అన్నదానం కొరకు పదార్థాలు సమకూర్చారు. సేవ చేయడానికి విద్యార్థులను, వాలంటీర్లను నియమించారు. విజయదశమి 8 అక్టోబర్‌ రోజున ఉదయం 10 గంటలకు మహారాజ్‌ దీక్ష ప్రారంభించారు. దీక్ష సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు విరమింపజేయనున్నారు. నందిపేట్‌ మండల కేంద్రానికి అతి సమీపంలో నిజామాబాద్‌ నందిపేట్‌ రోడ్డులో గల కేదారేశ్వర ఆలయం రోజురోజుకు అభివద్ధి చెందుతుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here