పలువురు సీఐలకు పోస్టింగులు

0
3


పలువురు సీఐలకు పోస్టింగులు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలువురు సీఐలకు పోస్టింగులు ఇచ్చారు. గతంలో ఇచ్చిన పోస్టింగుల్లో మార్పు చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్‌ ఎస్‌బీలో ఉన్న సీఐ అశోక్‌ రెడ్డికి బోధన్‌ ఎస్‌హెచ్‌వోగా అటాచ్‌మెంట్‌పై ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. తిరిగి ఈ స్థానంలో నిజామాబాద్‌ సీసీఎస్‌ సీఐ మల్లికార్జున్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డిలో ఉన్న సీఐ సాజిదుల్లాను గతంలో సిద్ధిపేట్‌ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేయగా ఈ ఉత్తర్వును రద్దు చేశారు. ఈయనకు తిరిగి బిచ్కుంద సీఐగా పోస్టింగునిచ్చారు. ఈ స్థానంలో ఉన్న నవీన్‌ కుమార్‌కు ఎల్లారెడ్డి సీఐగా అటాచ్‌మెంట్‌పై బాధ్యతలు అప్పగించారు.

 నిజామాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఉన్న నరేశ్‌ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ సిటీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసిన అనంతరం తిరిగి పోస్టింగు ఇవ్వనున్నారు. నగర సీఐగా ఉన్న నరేశ్‌ ఇటీవలే టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here