పల్లెకు పట్టణ సొబగులు

0
2


పల్లెకు పట్టణ సొబగులు

 ప్రణాళికలు సిద్ధం.. అమలే తరువాయి

● రూ.30 కోట్లు.. 51 అభివృద్ధి పనులు..

● నేడు పరిశీలనకు రానున్న రాష్ట్ర బృందం

న్యూస్‌టుడే, ఎడపల్లి

అలీసాగర్‌ ఉద్యావనం

‘‘ఓ వైపు నిజామాబాద్‌ కార్పొరేషన్‌.. మరో వైపు బోధన్‌ ద్వితీయశ్రేణి మున్సిపాలిటీ.. మధ్యలో ఎడపల్లి మండలం. ఇకపై ఇక్కడి పల్లెలు పట్టణ సొబగులను సంతరించుకోనున్నాయి.’’

రూర్బన్‌ పథకం కింద ఎడపల్లి ఎంపికైన విషయం తెలిసిందే. పట్టణాల్లోని వసతులను పల్లెల్లో కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం మొదటి విడతలో రూ.30 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబంధించి 51 అభివృద్ధి పనులకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. విద్య, వైద్యం, యువతకు ఉపాధి మార్గాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయలు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వ్యవసాయ పరిశ్రమ.. ఇలా అన్ని అంశాలను జోడిస్తూ ప్రగతి పనులు చేపట్టనున్నారు.

పనులను పరిశీలించనున్న అధికారులు

అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం కావడంతో పాటు పలు పనులు ప్రారంభయ్యాయి. మండల వ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. ఆయా పనుల ప్రగతి, ప్రణాళికల పరిశీలనకు శుక్రవారం రూర్బన్‌ పథకం రాష్ట్ర బృందం అధికారులు వస్తున్నారు.

స్థలాల ఎంపిక కోసం ప్రయత్నాలు..

అభివృద్ధి పనుల కోసం స్థలాల ఎంపికలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు. కల్యాణ మండపం, మినీ స్టేడియాలను ఎడపల్లిలో నిర్మించాలని కొందరు ప్రజాప్రతినిధులు, జానకంపేటలో నిర్మించాలని మరికొందరు భీష్మించుకు కూర్చున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలోనూ నిరసనకు దిగారు. ప్రజాప్రతినిధుల తీరుతో స్థల ఎంపికలో జాప్యం చోటుచేసుకొంటోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here