పల్లె అభివృద్ధికి ప్రణాళిక

0
5నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులనుద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మంజూరైన పథకాలతో పాటు అత్యంత ప్రాధాన్యత పథకాలతో సమానంగా ఈ కార్యాచరణ ప్రణాళికలో జిల్లా అధికారులతోపాటు గ్రామపంచాయతీ స్థాయిలో ఆయా విభాగాలకు సంబంధించిన సిబ్బంది ఇతర శాఖల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని, ఈ విషయంలో ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ కార్యదర్శి, ఎంపీడీవోలదే కాదని భావించకుండా అందరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లె అభివద్ధికి ప్రణాళిక ఎంతగానో బోధపడుతుందని, పచ్చదనం పరిశుభ్రత డ్రైనేజీ, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించడం, మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం కిందికి వేలాడిన వైర్లు పటిష్టం చేయడం, స్తంభాలకు మూడవ వైర్లు ఏర్పాటు చేయడం, శిథిలావస్థలో ఉన్న వంకర తిరిగిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి నూతనంగా బిగించడం చేసే పక్రియ జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. జిల్లా స్థాయి నుండి జిపి స్థాయి వరకు పనిచేసే సిబ్బంది, అధికారులు, అందరూ పాల్గొనాలని చెప్పారు. గ్రామపంచాయతీ పరిధిలోనే కాకుండా ప్రభుత్వ భవనాలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాసంస్థలు, అంగన్‌వాడి, గ్రామపంచాయతీ భవనాల ప్రభుత్వ పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రత ఇతర అంశాలలో గ్రామ పంచాయతీ స్థాయిలోనే కాకుండా జిల్లాలోని మున్సిపాలిటీ నగరపాలక స్థాయిలో కూడా పూర్తిచేయాలని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here