పళ్ల సెట్ పోయింది.. 8 రోజుల తర్వాత గొంతులోనే దొరికింది, వృద్ధుడికి చేదు అనుభవం!

0
0


వృద్ధుడికి ఎదురైన చేదు అనుభవం ఇది. బ్రిటన్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఓ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. మత్తులో ఉన్న అతడు గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. గట్టిగా దగ్గడంతో రక్తం పడింది. దీంతో అతడిని వెంటే ఎమర్జన్సీ వార్డుకు పంపారు. ఛాతికి ఎక్స్‌రే తీశారు. అంతా బాగానే ఉందని భావించారు. యాంటి బయోటిక్స్ రాసి డిశ్చార్జ్ చేశారు.

ఎనిమిది రోజులైనా అతడికి దగ్గు తగ్గలేదు. పైగా నోటి నుంచి రక్తం ధారలా బయటకు రావడం మొదలైంది. దీంతో బాధితుడు మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లి తన సమస్య చెప్పాడు. తన గొంతుకు ఏదో అడ్డుపడినట్లు ఉందని తెలిపాడు. దీంతో వైద్యులు ఈ సారి అతడి నోరు నుంచి ఛాతి వరకు ఎక్స్‌రే చేసి పరీక్షించారు. గొంతులో ఇరుక్కున్న పళ్ల సెట్ చూసి షాకయ్యారు. వెంటనే సర్జరీ చేసి దాన్ని తొలగించారు. రక్తం ఎక్కువగా పోవడంతో బాధితుడిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స కొనసాగించారు.

ఈ ఘటనపై బాధితుడు స్పందిస్తూ.. ‘‘సర్జరీ రోజు నా పళ్ల సెట్ హాస్పిటల్‌లో ఎక్కడో పెట్టి మరిచిపోయానేమో అనుకున్నా. మత్తులో ఉండటం వల్ల దాన్ని ఎప్పుడు మింగేశానో కూడా తెలియలేదు. సర్జరీ తర్వాతి రోజు నుంచి బాగా దగ్గు వచ్చేది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చేది. ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే నా పళ్ల సెట్ గొంతులో ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయాను’’ అని తెలిపాడు. చూశారుగా.. సర్జరీల్లాంటివి ఏమైనా జరిగితే పళ్ల సెట్లు వంటివి తీసేయడం ఉత్తమం. లేకపోతే.. ఈ వృద్ధుడిలాగానే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here