పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

0
11నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్ట వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో బక్రీద్‌ పండగ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను ఆవులను వధించ కూడదని వధించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ జంతు వధ నిరోధక చట్టం 1977 ప్రకారంగా శిక్షార్హులని చెప్పారు. బక్రీద్‌ పండుగ పశువులు ఖుర్బాని సందర్భంగా రోడ్లమీద ప్రార్ధన మందిరాల వద్ద గాని పబ్లిక్‌ ప్రదేశాల్లో వధించ కూడదని చెప్పారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు రెవెన్యూ రవాణాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 17 సమస్యాత్మక పాయింట్ల గుర్తించినట్లు చెప్పారు. వాహన ఓవర్‌ లోడింగ్‌ తో పశువులను రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడి నుండి అయితే పశువులు వస్తాయో అక్కడినుండి సంబంధిత వైద్యాధికారిచే పశువులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో రవాణా చేయాలని లేనిపక్షంలో నియమ నిబంధనల మేరకు చర్యలు తప్పవని చెప్పారు. పెద్ద పశువులనే రవాణా చేయాలని అక్రమంగా రవాణా చేసిన పశువులను పట్టుకొని గోశాలలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాగారం అర్సపల్లి గోపాల్‌ బాగ్‌, బోధన్‌ తాత్కాలికంగా ఆర్మూర్‌ మహిళా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన గోశాలలో తరలించాలని అక్కడ సరైన వసతి సౌకర్యాలైన నీరు, పశుగ్రాసం సిద్ధం చేసుకోవాలని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here