పశువుల దాణా పంపిణీ

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే పశువుల దాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి వకిడి సంతోష్‌ అన్నారు. బుధవారం పశువైద్యశాఖ అద్వర్యంలో తల్వేద గ్రామ రైతులకు సబ్సిడీపై మంజూరైన దాణా బ్యాగులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పోషకాలు ఉండే దాణాను విరివిరిగా వాడితే పశువులు ఆరోగ్యంగా ఉండి వ్యవసాయ పనులకు బాసటగా నిలుస్తాయని ఎంపిపి సంతోష్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యుడు హన్మంత్‌ రెడ్డి, ఎంపీడీఓ నాగవర్ధన్‌, గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి, రైతులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here