పసిబిడ్డకు డ్రగ్స్ ఇచ్చిన తల్లి, లోకాన్ని చూడకముందే..

0
0


వ మాసాలు మోసిన ఆ తల్లికి.. ఆ బిడ్డ భారమయ్యాడు. అప్పుడే పుట్టిన బిడ్డపై మమకారం చూపించాల్సిన ఆమె.. మాదక ద్రవ్యాల (డ్రగ్స్) ఇంజక్షన్ ఇచ్చి పరలోకానికి పంపేసింది. అనంతరం ఆ బిడ్డ శవాన్ని చెత్త సంచిలో వేసి డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆఫీసు పనిమీద ఊరెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చేసరికే దారుణం జరిగిపోయింది. బిడ్డ ఎక్కడని అడిగిన అతడికి ఊహించని సమాధానం ఎదురైంది.

న్యూ మెక్సికోలోని శాంటాఫేకు చెందిన ఓ మహిళ తరచుగా డ్రగ్స్ తీసుకొనేది. గర్భం దాల్చిన తర్వాత కూడా ఆమె అలవాటు కొనసాగించింది. అయితే, భర్త ఊర్లో లేని సమయంలో ఆమె బిడ్డను ప్రసవించింది. ఈ విషయం భర్తకు చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కడుపు(గర్భం)తో కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. బిడ్డ ఎక్కడని ప్రశ్నించగా చనిపోయాడని సమాధానం ఇచ్చింది. ఏడుస్తుంటే డ్రగ్స్ ఇచ్చానని చెప్పింది.

Read also: తల్లిదండ్రుల శవాల మధ్య పసిబిడ్డ.. 3 రోజులుగా నరకయాతన!

ఆగ్రహంతో ఊగిపోయిన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. డిటెక్టీవ్‌లు రంగంలోకి దిగి సోదాలు చేయగా ఇంట్లోని డస్ట్‌బిన్‌లోని ఓ నల్లని కవర్‌లో పసివాడి శవం కనిపించింది. ఈ సందర్భంగా భర్త మాట్లాడుతూ.. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పాడు. బిడ్డకు ఇంజక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించిందని తెలిపాడు.

Read also: 5 రోజుల పసిబిడ్డ గొంతు కోసిన తల్లి.. కారణం విని పోలీసులు షాక్!

డిటెక్టివ్‌లు అడిగిన ప్రశ్నకు నిందితురాలు స్పందిస్తూ.. తనకు నొప్పులు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియలేదని చెప్పింది. తాను నిద్రలేచే సరికే ప్రసవం జరిగిపోయి బిడ్డ నిర్జీవంగా పడి ఉన్నాడని తెలిపింది. అయితే, ఆ బిడ్డ ఏ తేదీన పుట్టాడో తనకు గుర్తులేదని చెప్పింది. దీంతో డిటెక్టీవ్‌లు భర్త చెప్పిందే నిజమని భావిస్తున్నారు. అలాగే, ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా అన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచిందనే కోణంలోనూ విచారిస్తున్నారు. శవ పంచనామా తర్వాత ఆ బిడ్డకు డ్రగ్స్ ఇచ్చిందా లేదా అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. అదే రుజువైతే ఆమెకు కఠిన శిక్ష తప్పదన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో నిందితురాలి పేరు, వివరాలను వెల్లడించలేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here