పసిబిడ్డను చేత్తో ఎత్తుతూ, సిగరెట్ కాల్చుతూ.. ఫేస్‌బుక్ లైవ్, తల్లి అరాచకం!

0
2


ప్పుడే పుట్టిన బిడ్డకు నరకాన్ని పరిచయం చేసింది ఆ తల్లి. ఒంటి చేత్తో ఆమెను గాల్లోకి లేపుతూ, మరో చేతితో సిగరెట్ వెలిగిస్తూ దారుణంగా వ్యవహరించింది. 30 నిమిషాల ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమె చర్యకు పాల్పడింది. ఈ వీడియో చూసి షాకైన నెటిజనులు మొత్తం లైవ్‌ను పోలీసులకు షేర్ చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Read also: షాకింగ్.. ఫే‌స్ క్రీమ్‌ రాసుకోగానే కోమాలోకి, మహిళ పరిస్థితి విషమం

అమెరికాలోని టేనస్సీలో చట్టనూగ ప్రాంతంలో నివసిస్తున్న సెక్స్‌టాన్ అనే యువతి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు ఆ బిడ్డను కనడం ఇష్టం లేదు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫూటుగా మద్యం తాగి, మంచంపై పడుకుని ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చింది. పక్కనే ఉన్న బిడ్డను ఒంటి చేత్తో ఎత్తుకుని, ఇంకో చేతితో సిగరెట్ అంటించుకుంది. ఆ తర్వాత ఆ పసిబిడ్డను ఎడమ చేతితో గాల్లోకి లేపుతూ కసరత్తు చేసింది. పోలీసుల విచారణలో ఆమె మాట్లాడుతూ.. ఆ బిడ్డను కనడం తనకు ఇష్టం లేదని, అందుకే అలా చేశానని తెలిపింది. ప్రస్తుతం ఆ బిడ్డ సెక్స్‌టాన్ తల్లి వద్ద సురక్షితంగా ఉంది.

వీడియో:

Read also: అప్పుడే పుట్టిన శిశువు తలను చిదిమేసి.. గార్డెన్‌లో పూడ్చిపెట్టిన చీర్‌గర్ల్Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here