పస్తులుండి పుస్తెలమ్మి తీసిన ‘తూనీగ’కి వినూత్న ప్రచారం

0
2


మ‌రో చంద‌మామ క‌థ ప్రేక్ష‌కుల ముందుకురానుంది. వెండితెర‌పై ఈ కొత్త క‌థ-కొత్త క‌థ‌నాన్ని తోడ్కొని సంద‌డిచేయ‌నుంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం వినూత్న రీతిలో సాగుతోంది. అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టు కుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ అస్తిత్వ ప్రతీక,ఆత్మీయ గొంతుక,కొత్త త‌రం క‌థ‌కుల‌కూ, క‌ళాకారుల‌కూ అండ‌గా నిలిచే మంచి మన‌సున్న మ‌నిషి, ప్రముఖ చిత్ర‌కారులు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఏలే చిత్ర బృందానికి అండ‌గా నిలిచారు. చిత్ర ప్రచార సార‌థి ప్రత్యేకంగా రూపొందించిన డిజిట‌ల్ డైలాగ్ ను సామాజిక అనుసంధాన మాధ్య‌మాలు ఫేస్ బుక్ – ఇన్ స్ట్రా గ్రాం ద్వారా విడు ద‌ల చేసి, ద‌ర్శకులు ప్రే మ్ సుప్రీమ్‌తో స‌హా ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌కు ఆత్మీయాభినంద‌న అందించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను రూపొందించి దర్శకుడు ప్రేమ్ సుప్రీత్ సహా ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం సామాజిక మాధ్య‌మాల ద్వారా చిత్ర యూనిట్ ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ..త‌న ఆనందాన్ని పంచుకుంది. వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణాంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయ‌ని యూనిట్ వెల్ల‌డించింది.

స్వ‌రాల వేడుక‌లో తూనీగ
ఓ సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన తాను, శ్రీ‌కాకుళం దారుల నుంచి ఇక్క‌డిదాకా ప్ర‌యాణించిన క్ర‌మాన ఎన్నో అవ‌స్థ‌లు, ఆ టుపోట్లు దాటుకుని వ‌చ్చాన‌ని భావోద్వేగ భ‌రితంగా తూనీగ ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ స్పందించారు.ఫిల్మ్ న‌గ‌ర్‌, రామానాయు డు స్టూడియోలో తూనీగ చిత్ర స్వ‌రాల వేడుక‌ను యూనిట్ స‌భ్యుల కుటుంబ స‌భ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల న‌డు మ నిర్వ‌హించారు.ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.ఇటీవ‌ల విడుద‌ల‌యిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయ‌ని, అదే క్ర‌మంలో ఈ సినిమా చేరాల‌న్న‌ది త‌న అభిమ‌తం అన్నారు. త న‌కూ ఉత్త‌రాంధ్ర నేల‌తో మంచి అనుబంధం ఉంద‌ని గుర్తుచేసుకున్నారు.నాన్న స‌ద్గురు శివానంద‌మూర్తి ఆశ్ర‌మం విశాఖ జిల్లా, భీ మునిప‌ట్నం, ఆనంద‌వ‌నంలో ఉంద‌ని, ఆ నేల అంటే త‌మ‌కెంతో ఇష్ట‌మ‌ని, మ‌రో మారు త‌న తండ్రి అయిన స‌ద్గురు వును స్మ‌రించుకున్నారు.

చింత‌ల‌న్నీ.. వెత‌ల‌న్నీ తీర్చే సినిమా కావాలి : మ‌రుధూరి
సీనియ‌ర్ డైలాగ్ రైట‌ర్ మ‌రుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర అంటే ఉద్య‌మాల గ‌డ్డ అని, అలాంటి నేల నుంచి వ‌చ్చిన ద ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్టించార‌ని, ఎన్నో అవ‌స్థ‌లూ, ఆటుపోట్లూ ఎదుర్కొ న్నార‌ని, ఈ వేళ ఈ స్వ‌రాల పండుగ‌లో ఆ క‌ష్టం అంతా మ‌రిచి,తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌యం సాధించాల‌ని దీవించారు.ముందున్న కాలాన మ‌రిన్ని చిత్రాలు తీసేందుకు స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు.

ప్ర‌చార చిత్రాలు విడుద‌ల అయిన నాటి నుంచి సామాజిక మాధ్య‌మాల్లో చిత్రంపై మ రింత ఆస‌క్తి పెరిగింద‌ని, చిత్ర ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ, క్రియెటివ్ రైటింగ్స్ అందించిన వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభు మహంతి త‌న‌కు అత్యంత ఆప్తుడ‌ని, సోదర స‌మానుడని అన్నారు.ఆన్ లైన్ మాధ్య‌మాల్లో ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి చ‌ర్చ న‌డుస్తోంద‌ని, అందుకు ఓ కార‌ణం అన్ని మీడియాలూ అందించిన గొప్ప స‌హాకారమేన‌ని, చిన్న చిత్ర‌మే అయినా, ఇది ఎన్నో చిం త‌లు తీర్చే చిత్రం కావాల‌ని ఆకాంక్షించారు. ఎంద‌రో జీవితాలు ముడిప‌డి ఉన్న చిత్రంగా ఇది రూపొందిందని, వారి రంగుల కలలు ఈ రంగులో లోకాన ఫ‌లిస్తే తానెంతో ఆనందిస్తాన‌ని అన్నారు.ఉత్త‌రాంధ్ర నేలతో మా అన్న‌య్య,ర‌చ‌యిత ఎంవీఎస్ హరనాథ‌రావు కు కూడా ఎంతో అనుబంధం ఉన్న రీత్యా ఇది త‌న కుటుంబ పండుగ అని వ్యాఖ్యానించి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నిం పారు.

ఆల్ ద బెస్ట్ తూనీగ
తూనీగ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని స్థానిక న్యూ సెంట్ర‌ల్ స్కూల్ (ఎన్సీఎస్) విద్యార్థులు ఆకాంక్షించారు. చిత్రానికి సంబంధించి స్వరాల వేడుక‌ను హైద్రాబాద్ లో నిర్వ హిస్తున్న సంద‌ర్భంగా పాఠ‌శాల ప్రాంగ‌ణాన తూనీగ ప్రోమో పోస్ట‌ర్లు చేత‌బూని, బుజ్జాయి లంతా సినిమా రూప‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.అనంతరం పాఠ‌శాల డైరెక్ట‌ర్ పోలుమ‌హంతి శ్రీ‌కాంత్ మాట్లాడుతూ..”అనేకానేక ఒడిదొడుకులు త‌ట్టుకుని, దాటుకుని తెరకెక్కి న ఈ సినిమా,రంగుల ప్ర‌పంచంలో మేలిమి చిత్ర‌రాజంగా నిలిచిపోవాలి.యువ ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ ముందున్న కాలంలో మ రిన్ని మంచి చిత్రాల రూప‌క‌ర్త‌గా పేరు తెచ్చుకోవాల‌న్న‌దే నా అభిమ‌తం.ఆధునిక ఆలోచ‌న‌ల‌కు కేరాఫ్ గా ఈ చిత్రం నిల‌వాలి.

కొత్త,కొత్త ప్ర‌య‌త్నాల‌కు నాంది కావాలి. క్రౌండ్ ఫండింగ్ ద్వారా శ్రీ‌కాకుళంకు చెందిన కొంద‌రు ఔత్సాహికులు రూపొం దించిన ఈ చి త్రం విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంది, లాభాల బాట‌లో నిర్మాత‌లు సాగాల‌న్న‌దే నా ఆకాంక్ష‌. చిత్రానికి సంబంధించిన పోస్ట ర్లు, డైలాగ్ పోస్ట‌ర్లు ఎంతో బాగున్నాయి.వినూత్న‌త‌కు చిరునామాగా నిలుస్తూ సామాజిక మాధ్య‌మాల్లో గ‌డిచిన ప‌ది రోజులుగా ఉద్ధృతం గా సాగిన ప్ర‌చారం న‌న్నెంతో ఆక‌ట్టుకుంది..” అని అన్నారాయ‌న‌.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here