పాఠశాలలో భయం.. భయం..

0
3


పాఠశాలలో భయం.. భయం..

ఆచన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 76 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే ఒక భవనం పూర్తిగా శిథిలమై మూలన పడింది. నాలుగు గదులు ఉండగా రెండు మాత్రమే కాస్త వినియోగానికి అనువుగా ఉన్నాయి. మరో రెండు గదుల్లో పైకప్పు, గోడలు ఉరుస్తున్నాయి. తడిసిన గదుల్లో కూర్చోబెట్టలేక వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

- -న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

బోధన్‌ మండలం హున్సా ఉన్నత పాఠశాలలో 298 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం పది తరగతులకుగాను కేవలం అయిదు గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఉర్దూ మాధ్యమానికి చెందినది కాగా.. మరోటి కార్యాలయానికి కేటాయించారు. వినియోగంలో ఉన్న మూడు తరగతులు పూర్తిగా శిథిలదశకు చేరుకొన్నాయి. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో వర్షం కురిస్తే గోడలు చెమ్మగా మారి ఉరుస్తున్నాయి. అవి ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని తరగతులను వరండాలో నిర్వహిస్తున్నారు.

-న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం

నవీపేట బాలుర ఉన్నత పాఠశాలలో 394 మంది విద్యార్థులున్నారు. 12 గదులుండగా అయిదు శిథిలావస్థకు చేరుకున్నాయి. 59 ఏళ్ల క్రితం నిర్మించిన ఏడో తరగతి భవనంలో వర్షం నీరు లోనికి వస్తుండటంతో 67 మంది(ఏ, బీ సెక్షన్లు) బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తొమ్మిదో తరగతి ఏ, బీ సెక్షన్ల గదుల పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. వీటిల్లో 74 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి గది సైతం శిథిలం కావడంతో 45 మందిని మరో గదిలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు.

- -న్యూస్‌టుడే, నవీపేట

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here