పాతబాన్సువాడలో చోరీ

0
1


పాతబాన్సువాడలో చోరీ


చిందరవందరగా పడేసిన వస్తువులు

బాన్సువాడ, న్యూస్‌టుడే: పాతబాన్సువాడలో తాళం వేసిన మూడు ఇళ్లలో గురువారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పాతబాన్సువాడకు చెందిన మట్ట సాయిలు ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి పై అంతస్తులో నిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.అయిదు వేల నగదు అపహరించుకోపోయారు. పాతబాన్సువాడలోనే గంగాధర్‌గౌడ్‌, బలరాంగౌడ్‌ ఇళ్ల తాళాలు సైతం పగులగొట్టి చొరబడ్డారు. ఇద్దరి ఇళ్లలో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని సీఐ పేర్కొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/129120.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here