పాత బంగారాన్ని అమ్మినా ట్యాక్స్ కట్టాలి తెలుసా ?

0
0


పాత బంగారాన్ని అమ్మినా ట్యాక్స్ కట్టాలి తెలుసా ?

బంగారాన్ని లాభాలతో అమ్మినా, లేదా బాండ్స్‌ను కొనుగోలు చేసి అందులో లాభాలు పొందినా.. పన్ను కట్టాలని ఎంత మందికి తెలుసు ? బంగారం అమ్మినా, కొన్నా.. మనం పన్ను పరిధిలోకి వస్తామని, అందుకు తగ్గట్టు ఐటీ ట్యాక్సేషన్ వర్తిస్తుందని ఎంత మందికి అవగాహన ఉంది ? మనలో చాలా మందికి దీని గురించి పెద్దగా తెలియదు. గోల్డ్ కొనుగోలు, అమ్మకంలో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం, ఆ తర్వాత ఇబ్బందులు పాలుకాకుండా జాగ్రత్తపడ్దాం.

ఈ బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీని రెండున్నర శాతం చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వీటి రేట్లు ఈ మధ్య మరింతగా పెరిగి మిడిసిపడ్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు పలుచబడడం వల్ల కూడా బంగారానికి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో చాలా మందికి వీటిపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓ సారి ట్యాక్సేషన్ గురించి చూద్దాం.

గోల్డ్ కొనుగోళ్లు

బంగారాన్ని మనం వివిధ రూపాల్లో సొంతం చేసుకుంటాం. మొదటిది ఫిజికల్ గోల్డ్. అంటే బిస్కెట్లు, ఆభరణాలు, కాయిన్ల రూపంలో కొనుగోలు చేయడం. మరో పద్ధతి పేపర్ గోల్డ్. అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఫండ్స్, సావరిబన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ వంటివి ఉన్నాయి. ఇది ఏ రూపంలో ఉన్న పన్ను ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ (స్వల్పకాలిక), లాంగ్ టర్మ్(దీర్ఘకాలిక) ఆధారపడి ఉంటుంది.

ఒక వేళ బంగారాన్ని కొన్న మూడేళ్లలోపు దాన్ని అమ్మేసే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. అంతకంటే ఎక్కువ సమయమైతే అది లాంగ్ టర్మ్ కిందికి వస్తుంది.

ఎంత పన్ను

ఎంత పన్ను

ఒక వేళ బంగారాన్ని కొని దాన్ని మూడేళ్ల లోపు లాభానికి అమ్మేశారని అనుకుందాం. అప్పుడు వచ్చిన సదరు లాభాన్ని మీ ఆదాయానికి కలిపి దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఏ శ్లాబులో ఉంటే అంత పన్ను కట్టాలి. అది ఐదు కావొచ్చు, ముప్ఫై కావొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా కావొచ్చు. ఇక్కడ మీరు సదరు బంగారంపై లాభాన్ని పొందారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి.

ఒక వేళ నష్టం వచ్చినా దాన్ని క్లెయిం చేసుకోవచ్చు అనే సంగతిని మర్చిపోవద్దు.

అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే..

అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే..

అంటే మీరు బంగారాన్ని మూడేళ్ల కంటే ఎక్కువ సమయం కింద కొని, దాని అమ్మకం ద్వారా లాభాన్ని పొందినట్టయితే.. అప్పుడు గోల్డ్ పై 20.8 శాతం వరకూ మీరు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్‌ఫ్లేషన్‌ను పరిగణలోకి తీసుకుని పన్నును లెక్కిస్తారు.

పేపర్ గోల్డ్ పరిస్థితి ఏంటి ?

పేపర్ గోల్డ్ పరిస్థితి ఏంటి ?

గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్‌పై పెట్టుబడి పెడ్తాయి. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ లెక్కన గోల్డ్ రేట్ పెరిగితే ఈ రెండిటి విలువా పెరుగుతుంది. అదే రివర్స్ అయినా పరిస్థితి అంతే.

ఈ నేపధ్యంలో గోల్డ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల లోపు మన పెట్టుబడులను లాభాలతో ఉపసంహరించుకుంటే వాటికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడేళ్లపైన అయితే లాంగ్ టర్మ్ పన్ను కట్టాలి.

ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సావరిన్ గోల్డ్ బాండ్లకు అయితే సాధారణంగా ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ సమయం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత వీని నుంచి ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కూడా లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ అయ్యేందుకు మార్గం సులభం. అయితే ఈ బాండ్స్‌ను రిడీమ్ చేసుకోవడం వల్ల ఏదైనా లాభం వస్తే దానికి పన్ను నుంచి మినహాయింపు ఉంది.

ఇక గోల్డ్ బాండ్స్‌కు అయితే కేంద్రం ఏడాదికి రెండున్నర శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఏడాదికి రెండు సార్లు వడ్డీ మన ఖాతాల్లో జమవుతుంది. ఈ బాండ్స్ పై వచ్చే లాభాన్ని ఆదాయంగా లెక్కిస్తారు. అయితే ఐటీ యాక్ట్ ప్రకారం వీటిపై టీడీఎస్ మాత్రం వర్తించదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here