పాముకాటుతో చిన్నారి మృతి

0
0


పాముకాటుతో చిన్నారి మృతి

రేవతి మృతదేహం

అంబారిపేట(దోమకొండ), న్యూస్‌టుడే: దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన చిన్నారి నీల రేవతి (8) నాగుపాము కాటుతో చనిపోయింది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అంబారిపేటకు చెందిన నీల రాములు-లక్ష్మీలకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు. మంగళవారం రాత్రి పడక గదిలో కూతురు రేవతితో పాటు కుమారున్ని పడుకోబెట్టారు. నిద్రిస్తున్న సమయంలో కూతురు రేవతి చేతిపై నాగుపాము కాటు వేసింది. నిద్ర నుంచి మేల్కొన్న చిన్నారి రేవతి ఏదో కరిచిందంటూ ఇంట్లో బీడీలు చుడుతున్న తల్లి లక్ష్మికి చెప్పింది. స్థానిక కాలనీ వాసులతో పడకగదంతా వెతికి చూడగా నాగుపాము కనిపించడంతో వెంటనే దాన్ని చంపేశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దుబాయిలో ఉంటున్న తండ్రి రాములుకు స్థానికులు సమాచారం అందించారు. చిన్నారి స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఆమె మృతికి సంతాపంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here