పాముకాటుతో రైతు మృతి

0
6


పాముకాటుతో రైతు మృతి


లింగం (పాత చిత్రం)

వదలపర్తి(నాగిరెడ్డిపేట), న్యూస్‌టుడే : వదలపర్తిలో సోమవారం రైతు లింగం (46) పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..లింగం ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు పంటకు నీరుపెట్టి రాత్రి 8:30 గంటలకు ఇంటికి వచ్చారు. భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో తలభాగం మొద్దుబారి మత్తుగా ఉందని కుటుంట సభ్యులతో చెప్పడంతో ఇంట్లోనే పాము కరిచిందేమోనని అనుమానం వచ్చి వెదికినా ఆచూకీ దొరకలేదు. వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆటోలో మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య పాపవ్వ, ఇద్దరు కూతుళ్లు పుష్పలత, అక్షయ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం రోదించిన తీరు పలువురిని కలచివేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మోహన్‌ తెలిపారు.


రవి

చికిత్స పొందుతూ యువకుడు...

ఆర్మూర్‌ గ్రామీణం : ఆర్మూర్‌ పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్సై విజయ్‌ నారాయణ్‌ కథనం ప్రకారం.. పట్టణంలో చిన్నబజార్‌కు చెందిన గన్నారం రవి (29) ఇళ్ల కిటికీలకు గ్లాస్‌ ఫిటింగ్‌ పనులు చేస్తుంటాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి ఆయన మామిడిపల్లిలో తన దుకాణం మూసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా పిస మల్లన్న ఆలయ సమీపంలో సెంట్రల్‌ లైటింగ్‌ డివైడర్‌ నిర్మాణం వద్ద ఉన్న రాళ్లను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయణ్ని ఆర్మూర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా రైతు...

కామారెడ్డి నేరవిభాగం : రోజంతా పొలం పనులు చేసి ఇంటికి వెళ్తున్న ఓ మహిళా రైతును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాధాబాయి (35) అనే మహిళా రైతు ఈ ప్రమాదంలో మరణించింది. పొలంలో పనులు ముగించుకొని రాత్రి కావడంతో ప్రధాన రహదారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచింది. ఆమె మరణాన్ని తలచుకొని భర్త రమేష్‌తో పాటు బాధిత కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. మహిళా రైతు రాధాబాయి దుర్మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

https://betagallery.eenadu.net/htmlfiles/134094.htmlSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here