‘పాము బాబోయ్’ అంటూ మహిళ కేకలు.. ఇంతకీ అదేంటో తెలుసా?

0
3


పార్కింగ్‌లో కారును తీసేందుకు వెళ్లిన ఓ మహిళ ‘‘పాము.. పాము.. రక్షించండి’’ అంటూ కేకలు పెట్టింది. దీంతో అంతా చుట్టుపక్కల ఉన్న జనం అక్కడికి వెళ్లి చూసి.. తొలుత వాళ్లు కూడా పాము అనుకొని రెండు అడుగులు వెనక్కి తగ్గారు. అయితే, అది ఎంతకీ కదలకపోవడంతో కాస్త ధైర్యం తెచ్చుకుని దగ్గరకు వెళ్లి చూశారు. అసలు విషయం తెలుసుకుని బిగ్గరగా నవ్వారు.

Read also: బిచ్చగాడి ఆస్తి చూసి పోలీసులు షాక్.. లక్షల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు!

ఫాతిమా దావూద్ అనే మహిళ ఇటీవల తనకు ఎదురైన ఓ ఫన్నీ అనుభవాన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న ఆమె ఓ రోజు షాపింగ్‌కు వెళ్లిన ఆమె పార్కింగ్‌లో ఉన్న తన కారు డోరు తెరుస్తుండగా.. ‘పాము’ కనిపించింది. దీంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ.. ఇతర వాహనదారులను కూడా కంగారు పెట్టించింది.
ఆమె అరుపులకు అంతా అదో పెద్ద పామై ఉండొచ్చని భావించారు. కానీ దగ్గరకు వెళ్లి చూస్తేగానీ అసలు విషయం తెలియలేదు. అది పాము కాదని, తలకు పెట్టుకునే సవరం (కృత్రిమ జెడ) అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఫాతిమా కూడా తన పొరపాటును తెలుసుకుని నవ్వకుంది. మిగతా వాహనదారులకు క్షమాపణలు చెప్పింది. పాము అనుకున్న ఆ సవరం చిత్రాన్ని కూడా ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

Read also:
డేంజర్ స్నేక్.. ఈ పాము కరిస్తే చర్మం కొవ్వొత్తులా కరిగిపోతుంది!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here