పారిస్‌లో బన్నీ, పూజాల `సామజవరగమన`

0
1


నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫెయిల్యూర్‌తో లాంగ్ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం మాంటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమా అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. టీజర్‌తో పాటు సామజవరగమన, రాములో రాములా పాటకు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా సామజవరగమన పాటను ఇప్పటికే 73 లక్షలపైగా వ్యూస్‌ సాధించి సౌత్‌లో అత్యధిక మంది చూసిన పాట రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది.
Also Read: బన్నీ, మహేష్ అయితే ఏంటి.? తగ్గేది లేదంటున్న నందమూరి హీరో

సినిమాతో పాటు ప్రత్యేకంగా ఈ పాట మీద కూడా భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగ్గట్టుగా పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాట చిత్రీకరణ కోసం హీరో హీరోయిన్లతో పాటు చిత్రయూనిట్‌ పారిస్‌ చేరుకున్నారు. అల్లు అర్జున్‌, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. తమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించారు.

లాంగ్ గ్యాప్‌ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై అభిమానుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టా్‌ర్‌ కాస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ టబు, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: ప్రభాస్‌ కొత్త సినిమా కథ.. పాత చింతకాయ పచ్చడే..!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here