పార్కులో గ్యాంగ్ రేప్.. ‘ఫేస్‌బుక్‌’తో అన్నదమ్ముల అఘాయిత్యాలు

0
6


లుగురు అన్నదమ్ములు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ముగ్గురు బాలికలు పోలీసులను ఆశ్రయించేవరకు ఈ విషయం బయటకు పొక్కలేదు. పైగా ఈ నలుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం. అత్యాచారానికి పాల్పడుతున్న ప్రాంతం పబ్లిక్ పార్క్ కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌లో చర్చనీయమైన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సబస్టియన్ బల్తాతూ (18), డానియల్ బల్తాతూ (22), వీరి బంధువులు పరీజియన్ కలిన్ (20), అడ్రియన్ కలిన్ (20)లు ఫేస్‌బుక్ ద్వారా బాలికలతో చాట్ చేయడం అలవాటుగా మలచుకున్నారు. వీరి అఘాయిత్యాలకు గ్రేటర్ మంచెస్టర్‌లోని లెవెన్‌షుల్మే పార్క్‌ను ఎంచుకున్నారు. ఆ పార్కులోని పొదల్లో శిబిరాన్ని (టెంట్లు) ఏర్పాటు చేసుకుని మరీ వీరు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడారు.

Read also: కుక్కకు ఆహారంగా రేపిస్టు అంగం.. అతడిని కొరుక్కుని తింటుంటే వీడియో!

ఇళ్ల నుంచి పారిపోయి స్నేహితుల ఇళ్లలో నివసిస్తున్న బాలికలనే వీరు లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. వీరి బాధితుల్లో ముగ్గురు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలతో స్నేహం చేస్తూ.. పార్టీ చేసుకుందామని పార్కుకు పిలిచేవారు.

బాలిక ఒంటరిగా పార్కుకు రాగానే.. నిందితుడిలో ఒకరు ఆమెతో సెక్స్ చేసేవాడు. ఆ తర్వాత మరో నిందితుడి వచ్చి ఆమెను బలవంతం చేసేవాడు. ఆ తర్వాత ఆమెను మిగతా ఇద్దరి వద్దకు తీసుకెళ్లేవారు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఈ గ్యాంగ్ ఆమెను వ్యభిచార గృహాంలో చేర్చేందుకు ప్రయత్నించారు. అక్కడ కూడా మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఆ నలుగురిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది.

Read also: సెక్స్‌గేమ్ హర్రర్.. అంగాన్ని కోసేసిన ప్రియురాలు, చివర్లో ఊహించని ట్విస్ట్!

ఈ కేసును విచారించిన కోర్టు ఆ నలుగురి అన్నదమ్ములపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బాధిత బాలికల తరఫు కేసు వాదించిన న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ కోసం వెతికే ఒంటరి బాలికలను నిందితులు లక్ష్యంగా చేసుకొనేవారు. వారిని పార్కులోకి తీసుకెళ్లి టెంట్‌లో ఎంజాయ్ చేసేవారు. ఆ తర్వాత మరొకరు వచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు’’ అని తెలిపారు.

‘‘తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల బాధిత బాలికలు వేరొకరి స్నేహం కోసం ప్రయత్నించారు. అదే వీరికి కలిసి వచ్చింది’’ అని తెలిపారు. వారిని కలిసేందుకు మాత్రమే తాము పార్కుకు వెళ్లామని, ఒకరి తర్వాత ఒకరు తమపై అత్యాచారానికి పాల్పడతారని ఊహించలేదని బాధిత బాలికలు కోర్టుకు తెలిపారు. వాదోపవాదాలు పరిశీలించిన కోర్టు ఈ గ్యాంగ్‌కు నేతృత్వం వహించిన పరిజియయన్ కలిన్‌కు 13 ఏళ్లు, డానియల్‌కు 8 ఏళ్లు, సెబస్టియన్‌కు 3 ఏళ్లు, అడ్రియన్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది.

Read also: 250 మంది చిన్నారులను రేప్ చేసి డైరీలో రాసుకున్న డాక్టర్!

ఈ బాలికలపై ఈ నలుగురితోపాటు మరికొందరు కూడా అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ పార్కులో పొదలను తొలగించారు. చెట్ల కొమ్మలను ట్రిమ్ చేసి, నిందితులు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని స్వాధీనం చేసుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here