పార్టీకి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు

0
2


పార్టీకి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు

వివరాలు వెల్లడిస్తున్న మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజాక్‌

ఎడపల్లి, న్యూస్‌టుడే: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెరాస మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రజితాయాదవ్‌ పేర్కొన్నారు. ఎడపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన గ్రామ కమిటీల వివరాలను వెల్లడించారు. ఎడపల్లి అధ్యక్షుడిగా అహ్మద్‌, సురేశ్‌ గౌడ్‌ (మంగళ్‌పాడ్‌), సాయిలు(కుర్నాపల్లి), సురేశ్‌(ఠాణాకలాన్‌), అజయ్‌ గౌడ్‌(జానకంపేట), చిట్టిబాబు (పోచారం), జానిమియా (ఎమ్మెస్సీ ఫారం), కిషన్‌(ధర్మారం), రంజిత్‌(బాపునగర్‌), సంతోష్‌ (దుబ్బతండా), రాజారెడ్డి (బ్రాహ్మణపల్లి), ఎల్లయ్య (ఏఆర్పీక్యాంపు), గంగాధర్‌ (జంలం), ఖాజామోయినోద్దీన్‌ (నెహ్రూనగర్‌), స్వామి (వడ్డెపల్లి)లను నియమించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండలాధ్యక్షుడిని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ప్రకటిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు శ్రీరామ్‌, ఇమ్రాన్‌, సర్పంచి గంగాప్రసాద్‌, ఎల్లయ్యయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here