పాలకుల వైఫల్యంతో ప్రగతికి దూరం

0
0


పాలకుల వైఫల్యంతో ప్రగతికి దూరం

పాదయాత్ర చేస్తున్న వెంకటరమణారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో వివిధ వార్డుల్లో పాదయాత్రకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరమణారెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. కాకతీయనగర్‌లోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. దేవునిపల్లి, విద్యానగర్‌, మధురానగర్‌, అశోక్‌నగర్‌, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలతో పోలిస్తే కామారెడ్డి జిల్లా కేంద్రం చాలా వెనుకబడి ఉందని, దీనికి పాలకుల వైఫల్యమే కారణమన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తేలు శ్రీను, కుంట లక్ష్మారెడ్డి, విపుల్‌, వెంకట్‌రెడ్డి, బాలరాజు, మహేష్‌గుప్తా, రాజలింగం, నారాయణ, భరత్‌, నరేష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here