పాలిటిక్స్ వద్దు అని చెప్పా, చిరంజీవి వినలేదు.. నవ్వుతూనే చురకలేసిన అమితాబ్

0
3


అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీరిద్దరూ మెగాస్టార్లే. హిందీలో దిగ్గజ నటుడు అమితాబ్ అయితే.. తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. అయితే, ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ బంధంతోనే చిరంజీవికి అమితాబ్ బచ్చన్ ఎన్నో సలహాలు ఇచ్చారట. కానీ, వాటిలో చిరంజీవి ఒక్కటి కూడా పాటించలేదట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పారు.

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. దీంతో అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిరంజీవి, అమితాబ్‌లను హిందీలో ఈ సినిమాను విడుదలచేస్తోన్న ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈ స్టార్లు ఇద్దరూ పలు విషయాలను పంచుకున్నారు.

Also Read: ‘రొమాంటిక్’ ప్రీ లుక్: పూరి భుజాలపై పోరి!

ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను ఈయనికి సలహాలు ఇస్తూనే ఉంటాను.. కానీ, ఎప్పుడూ వాటిని పాటించలేదు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నాను అని నాకు చెప్పారు. దయచేసి ఆ తప్పు చేయొద్దు అని చెప్పాను. రజినీకాంత్‌కు ఇదే సలహా ఇచ్చాను, మీకూ చెప్తున్నాను దయచేసి రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను. అయినప్పటికీ ఈయన వెళ్లారు. కొంతకాలానికి మళ్లీ బయటికి వచ్చేశారు’ అని నవ్వుతూనే చురకలంటించారు. అమితాబ్ ఈ విషయాలు చెబుతున్నంసేపు చిరంజీవి కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

‘‘ఈ అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి మీరు ఎలా వచ్చారు?’’ అని అమితాబ్‌ను ఫర్హాన్ అక్తర్ అడిగారు. దీనికి అమితాబ్ సమాధానం ఇస్తూ.. ‘‘చాలా కాలంగా నేను, చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన నన్ను ఏదైనా అడగడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి ఈ పాత్ర చేస్తారా? అని అడిగారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఆ పాత్రకు చిరంజీవి నన్ను ఎంపిక చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. ఈ సినిమాలో నేను చేసింది చిన్న పాత్రే అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఇక అమితాబ్‌ను తీసుకోవడంపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్న తరవాత గురువు పాత్ర ఎవరు చేస్తారు అని మా డైరెక్టర్ నన్ను అడిగారు. ఎందుకంటే నిడివి ప్రకారం చూస్తే అది చిన్న పాత్ర. కానీ, నా పాత్ర కంటే గొప్ప పాత్ర. ఎవరు చేయాలి అని అనుకున్న సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు అమితాబ్ గారు. కానీ, ఆయన చేస్తారా అనే అనుమానం. నేను ట్రై చేస్తాను సురేందర్.. ఆయన చేయనంటే నిరుత్సాహపడొద్దు అని చెప్పా. నేను ఫోన్ చేసిన వెంటనే అస్సలు సమయం తీసుకోకుండా అమితాబ్ ఓకే చెప్పారు. ఈ పాత్రకు నేనే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అని మాత్రమే ఆయన నన్ను అడిగారు’’ అని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here