పాల క్యాన్లు పంపిణీ

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తిమ్మా నగర్‌ గ్రామంలో హెరిటేజ్‌ పాడి రైతులకు పాల క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో హెరిటేజ్‌ పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్‌ ఆర్‌. సాయిలు పాల నాణ్యత గూర్చి పాడి రైతులకు విపులంగా వివరించారు. పాలలో పోషకపదార్థాలు మెండుగా ఉన్నప్పటికీ అవి చాలా త్వరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయని, బ్యాక్టీరియా వద్ధికి అనుకూలంగా ఉంటాయన్నారు. వివిధ కారణాలవల్ల పాలు కలుషితమవడం వల్ల త్వరగా పులిసి పోతాయి చెడిపోతాయన,ఇ అపరిశుభ్రమైన కల్పితమైన పాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. స్వచ్ఛమైన నాణ్యమైన పాల ఉత్పత్తి వల్ల పాలు ఎక్కువ కాలం తాజాగా, చెడిపోకుండా నిల్వ ఉంటాయని, త్వరగా పులిసిపోవడం గానీ ఇరిగిపోవడం గానీ ఉండదన్నారు. పరిశుభ్రమైన పాల ఉత్పత్తి లాభదాయకమైన మరియు విజయవంతమైన పశుపోషణలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి చాల ముఖ్యమైన అంశమని, అప్పుడే పితికిన తాజా పాలను శుభ్రమైన పలుచని పొడివస్త్రంతో వడబోయాలని పేర్కొన్నారు. పాలకు ఉపయోగించే పాత్రలను స్టెయిన్లెస్‌ స్టీల్‌ పాత్రలను ఉపయోగించాలని, ఈ పాత్రలు అయితేనే పాల నాణ్యతకు అనుకూలంగా ఉంటుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here