పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే,ఊచలు లెక్కపెడతావ్… హిందూ జొమాటో వినియోగారుడికి పోలీసుల హెచ్చరిక

0
2


పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే,ఊచలు లెక్కపెడతావ్… హిందూ జొమాటో వినియోగారుడికి పోలీసుల హెచ్చరిక

జోమాటో ఫుడ్ ఆర్డర్ తెచ్చిన డెలివరి బాయ్ హిందువు కాదంటూ వెనక్కి పంపిన వినియోగదారుడికి భోపాల్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటీ పోస్టులు పెట్టి ,మతాల మధ్య చిచ్చురేపితే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఆరు నెలల వరకు ఎలాంటీ సోషల్ మీడీయా చర్యలు చేపట్టకుండా ఆర్డర్ వేశారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన అనంతరం అది డెలివరి ఇచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో ఫుడ్ ఆర్డర్‌ను వెనక్కి పంపాడు. దీంతోపాటు ఆ విషయాన్ని జోమాటో సైతం సమాచారం అందించాడు. అయితే జొమాటో మాత్రం ఈ విషయం కులమతాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

దీంతో అమిత్ శుక్లా ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేసింది. ఓ సంధర్భంలో హిందు ముస్లింల సమైక్యతను దెబ్బతీసే పరిస్థితి కూడ వచ్చింది. ఇలాంటీ నేపథ్యంలోనే వ్యక్తిగత అంశాలను కూడ సమాజంపై రుద్ది అనవసర విషయాలకు రాద్దాంతం చేసే ఇలాంటీ వ్యక్తులపై కఠినంగా వ్యవహరించారు పోలీసులు .ఈనేపథ్యంలోనే ఆ పోస్టు పెట్టిన అమిత్ శుక్లాను ఆరు నెలల పాటు పోలీసుల నిఘాలో ఉంచారు. శాంతి భంగం కల్గించే ఇలాంటీ చర్యలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు జబల్‌పూర్ జిల్లా ఎస్పీ అమిత్ సింగ్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here