పిల్లలకు సంస్కారం నేర్పిద్దాం

0
1


పిల్లలకు సంస్కారం నేర్పిద్దాం


మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు జిల్లా సంఘ్‌చాలక్‌ గురుచరణ్‌

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో మార్పు తీసుకురావాలంటే పిల్లలకు సంస్కారం నేర్పిద్దామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు జిల్లా సంఘ్‌చాలక్‌ గురుచరణ్‌ పిలుపునిచ్చారు. శక్కర్‌నగర్‌ రామ్‌లీలా మైదానంలో దసరా సందర్భంగా వీహెచ్‌పీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పూర్వీకులు మన వాతావరణం, జీవన విధానం కోసం పండుగలను నిర్వహించారన్నారు. ప్రతి పండుగ వెనక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉందని చెప్పారు. తినే ఆహారం, దీక్షలు వంటివన్ని ఆచరించదగినవేనన్నారు. హిందూ ధర్మం జీవన విధానమని గుర్తించాలని చెప్పారు. నైతిక విలువలు, సంస్కారం పెంపొందించే శ్లోకాలు నేర్పించాలని సూచించారు. తక్షణం కోరికలు సిద్ధించాలనే పూజలు చేసే విధానం సరికాదన్నారు. భగవంతుడు మనకిచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే శరీరరమే గొప్ప సంపదని వర్ణించారు. అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మతం పూజా గదిలో, కులం ఇంటి గడప వరకే పరిమితం కావాలని సూచించారు. చెడు గుణాలను పారదోలి మంచి జీవనం అనుసరించినప్పుడే నిజమైన విజయదశమి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సభలో అధ్యక్ష, కార్యదర్శులు రేఖం దాసు, శేఖర్‌, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. షమీ పూజకు ఏసీపీ రఘు హాజరయ్యారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here