పిల్లలను నులి పురుగుల మాత్రలు వేయించాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలు రోగాల బారిన పడకుండా వారికి నులి పురుగుల నివారణ మాత్రలు (ఆల్బండజోల్‌) మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆగష్టు 8న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగులు సంక్రమించకుండా నియంత్రించడానికి పిల్లలందరికి మాత్రలు వేయించాలని సూచించారు. వాటివల్ల సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధి కలుగుతుందని, రక్తహీనత నియంత్రించవచ్చని తెలిపారు. పోషకాహార ఉపయోగం మెరుగు పరుస్తుందని పేర్కొన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల వారందరికి ఉచితంగా ఆల్బండజోల్‌ మాత్రలు అందజేస్తారని, అంగన్‌వాడి కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు వేయించాలని సూచించారు. పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ రాజు, ఐసిడిఎస్‌ అధికారిణి రాధమ్మ, విద్యాశాఖాధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here