పీఆర్‌సీ ప్రకటించాలి

0
3


పీఆర్‌సీ ప్రకటించాలి

కంఠేశ్వర్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌ వెంటనే ప్రకటించాలని ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ ఉపాధ్యక్షుడు పాలేటి వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. నగరంలోని తపస్‌ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యాల వారీగా అన్ని కేటగిరిలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఏపీలో సీపీఎస్‌ రద్దు చర్యల్లో భాగంగా కమిటీని ఏర్పాటు చేశారని, రాష్ట్రంలో కూడా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. జూన్‌ 21న అన్ని పాఠశాలల్లో యోగా దివాస్‌ను నిర్వహించాలని తెలిపారు. పదవీ విరమణ వయస్సు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులకు ఫ్యామిలీకేర్‌ సెలవులతో పాటు మాతృ, పితృ సంబంధిత దహన సంస్కార కార్యక్రమాల సందర్భంగా సెలవులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇప్పకాయల సుదర్శన్‌, రామకృష్ణారెడ్డి, రాఘవేందర్‌రావు, కీర్తి సుదర్శన్‌, రమేశ్‌, శ్యాంకుమార్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here