పీజీ కోర్సుల ఎత్తివేత తగదు

0
2


పీజీ కోర్సుల ఎత్తివేత తగదు

మాట్లాడుతున్న పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సుల ఎత్తివేత తగదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 242 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా, వీటిలో 42 డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులను నిర్వహిస్తున్నారని, ఈ కోర్సులను విడతల వారీగా ప్రభుత్వం ఎత్తివేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా సమన్వయకర్తగా నరేష్‌, సభ్యులుగా సంగమేశ్వర్‌, శరత్‌, రేవంత్‌, నితిన్‌, గణేశ్‌, నరేష్‌, కృష్ణమూర్తి, అఖిల, నవిత తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి రాము, ప్రతినిధులు నరేందర్‌, కల్పన తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here