పీజీ వైద్యం

0
2


పీజీ వైద్యం

ముగిసిన ఎంసీఐ తనిఖీలు

ఆరు విభాగాలకు 32 సీట్లు మంజూరు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మెరుగుపడనున్నాయి. ఇప్పటి వరకు 32 పీజీ వైద్యుల సీట్లు కేటాయించారు. ఇంకా 50 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 120 మంది వైద్యులకు పీజీ విద్యార్థులు తోడైతే ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందనుంది.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం : జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 15 విభాగాల్లో 109 పీజీ వైద్య సీట్ల కోసం నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేశారు. ఇప్పటికే 6 విభాగాలకు 32 సీట్లు కేటాయించగా.. మరో తొమ్మిదింటికి సీట్ల సంఖ్యను ప్రకటించాల్సి ఉంది. ఇక చివరిదైన పిల్లల వైద్య సీట్లకు సంబంధించి సోమవారం ఎంసీఐ ప్రతినిధులు జిల్లా ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. సరిపడా వైద్యులు, సౌకర్యాలు చూసి సంతృప్తి చెందిన నేపథ్యంలో ఈ విభాగంలో 6-8 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.

ఏ విభాగంలో ఎన్ని సీట్లకు దరఖాస్తు చేశారంటే

అనాటమీ 5, ఫిజియాలజీ 5, బయోకెమిస్ట్రీ 5, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ 3, పాథాలజీ 9, మైక్రోబయాలజీ 5, జనరల్‌ మెడిసిన్‌ 15, పిల్లల విభాగం 9, మానసిక వైద్యవిభాగం 5, జనరల్‌ సర్జరీ 11, ఎముకల విభాగం 12, ఈఎన్‌టీ 5, ఆప్తమాలజీ 5, అనస్థీషియా 6, స్త్రీవైద్యవిభాగం 9.

రెండో దశలో రేడియా.. పల్మా..

వైద్య కళాశాలలో ప్రస్తుతం రేడియాలజీ, పల్మాలజీ విభాగాలకు ఇప్పటి వరకు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేయలేదు. ఈ రెండింటిలో ప్రొఫెసర్లు, అవసరమైన పరికరాలు లేకపోవడం గమనార్హం. వీటిని సమకూర్చుకొని దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు.

పరిశోధనకు ప్రాధాన్యం

రోగులకు వచ్చిన వ్యాధి, నయం చేసేందుకు కొత్త పద్ధతులు, మరింత మెరుగైన వైద్యం అందించడం ఎలా? వ్యాధి బారిన పడటానికి కారణాలు, జిల్లాలో ఇలాంటి కేసులు ఎందుకు వస్తున్నాయి? తదితర అంశాలపై పీజీ విద్యార్థులు పరిశోధన చేస్తారు. దీనివల్ల రోగికి మంచి వైద్యం అందడంతో పాటు కొత్తగా వస్తున్న వ్యాధులను గుర్తించి జిల్లా ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here