పుట్టిన బిడ్డకు ముర్రుపాలు అత్యంత క్షేమకరం

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పట్టించటం ఎంతో శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల్లో కొన్ని అపోహలు,ఆధునిక పోకడల వల్ల పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించలేకపోతున్నారని ఇది దురదష్టకరమన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలలోని పెద్దల సలహాల మేరకు తల్లులు పిల్లలకు ముర్రుపాలు ఇచ్చే వారని, ప్రస్తుతం 40 శాతం తల్లులు మాత్రమే ముర్రుపాలు అందిస్తున్నారని తెలిపారు. అవగాహన రాహిత్యం వల్లనే ప్రస్తుతం తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవలసిన అగత్యం ఏర్పడిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. తల్లిపాల విశిష్టతను వాటిలోని ఆరోగ్యకర విషయాలను యుక్తవయసులో ఉన్న ప్రతి ఒక్కరు, ముందు ముందు తల్లులు కావలసినవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరమన్నారు. ముర్రుపాలు అంటే వజ్రసమానమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, తొలి టీకాగా పనిచేస్తుందని వీటిలో యాంటీ ఇన్ఫెక్టివ్‌ ప్రాపర్టీస్‌ ఉంటాయని, నిమోనియా, శ్వాసకోశ వ్యాధులు, ఎలర్జీలు రాకుండా నిరోధిస్తాయని ఆయన తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here